ఎన్నికల సమయంలో ఓట్ల లెక్కింపు వీడియోలనే భద్రపరచలేకపోతే ఎలా? అంటూ సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని నిలదీసింది. కర్ణాటకలోని శృంగేరి అసెంబ్లీ నియోజకవర్గం 2023 ఎన్నికల అసలు లెక్కింపు వీడియోలు కనిపించడం లేదన్న సమాధానంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటి సాకులను అంగీకరించబోమని స్పష్టం చేసింది. తదుపరి విచారణకు అందుబాటులో ఉన్న రికార్డులన్నీ సమర్పించాలని ఆదేశించింది. లేకపోతే ప్రతికూల నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. 2023 ఎన్నికల్లో శృంగేరి స్థానం నుంచి కాంగ్రెస్ నేత టీడీ రాజేగౌడ తొలుత గెలిచారు. అయితే బీజేపీ అభ్యర్థి జీవరాజ్ ఈ ఫలితాన్ని కర్ణాటక హైకోర్టులో సవాలు చేశారు. దీంతో…
తాజా విచారణలో అసలు లెక్కింపు వీడియోలు కనిపించడం లేదని ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది తెలిపారు. దీనిపై జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సంజీవ్ సచ్దేవాలతో కూడిన ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఎన్నికలు నిర్వహించే సంస్థ వద్ద వాటికి సంబంధించిన రికార్డులు లేకపోవడంపై ప్రశ్నించింది.