పారిస్: ఫ్లైదుబాయ్ విమాన ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ విమానయాన సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్‌కు రాకపోకలు సాగించే తమ విమానాల్లో పాకిస్తానీ పైలట్లు, క్యాబిన్ సిబ్బందిపై ఎయిర్ ఫ్రాన్స్ నిషేధం విధించింది. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ఏ దేశానికైనా విమానాలు నడిపేటప్పుడు ఆయా దేశాల చట్టాలను పాటించాల్సి ఉంటుందని.. ఇందులో భాగంగానే ఇజ్రాయెల్ జారీ చేసిన నూతన భద్రతా ఆదేశాలకు కట్టుబడి పాకిస్తాన్ పైలట్లు, క్యాబిన్ సిబ్బందిని ఇజ్రాయెల్ రూట్లలో నడిచే విమానాల్లో నియమించబోమని ఎయిర్ ఫ్రాన్స్ స్పష్టం చేసింది. పాకిస్తాన్‌తో పాటు మరికొన్ని దేశాల పైలట్లు, సిబ్బందికి కూడా ఈ నిషేధం వర్తిస్తుందని తెలిపింది.…
ఇందులో భాగంగా ఇజ్రాయెల్‌తో అధికారికంగా దౌత్య సంబంధాలు లేని పాకిస్తాన్, ఇరాన్, సౌదీ అరేబియా, అల్జీరియా, ట్యునీషియా వంటి సుమారు 31 దేశాల పౌరసత్వం కలిగిన పైలట్లు, సిబ్బంది తమ దేశ వైమానిక పరిధిలోకి రాకూడదని ఇజ్రాయెల్ ఆదేశాలు జారీ చేసింది. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ఒక దేశం అనుమతి లేనిది ఆ దేశ గగనతలంలోకి ప్రవేశించడం నిషేధం.