పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నార్లాపూర్-అంజనగిరి జలాశయం మొదటి లిఫ్టు వద్ద రెండు భారీ మోటార్లను ఎట్టకేలకు ప్రారంభించారు.నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం అంజనగిరి వద్ద బుధవారం రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ మోటార్లను స్విచ్ ఆన్ చేసి కృష్ణా జలాల ఎత్తిపోతలను ప్రారంభించారు.ముందుగా పూజలు నిర్వహించిన అనంతరం రెండో మోటార్‌ను, ఆ తర్వాత మొదటి మోటార్‌ను ఆన్ చేశారు.దీంతో కృష్ణానది నుంచి నీటిని నార్లాపూర్-అంజనగిరి జలాశయంలోకి ఎత్తిపోశారు.
ఒక్కో మోటార్ సెకనుకు మూడు వేల క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసే సామర్థ్యంఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. జలాశయంలో ఆరు టీఎంసీల నీటిని నిల్వ చేసి, మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని తెలిపారు.పాలమూరు జలాశయానికి ఏర్పాటు చేసిన తూము ద్వారా పక్కనే ఉన్న మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం మొదటి లిఫ్టు పరిధిలోని ఎల్లూరు జలాశయానికి నీటిని తరలించి, అచ్చంపేట, కల్వకుర్తి ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు.సాగునీటిపారుదల శాఖ చీఫ్ ఇంజినీర్ పార్థసారథి, ఇన్‌ఛార్జి సూపరింటెండింగ్ ఇంజినీర్ రవీందర్ మాట్లాడుతూ.. ఈ…