హైదరాబాద్ నగరంలో పండగల సీజన్ సమీపిస్తున్న వేళ పోలీసు శాఖలో భారీగా మార్పులు చోటుచేసుకున్నాయి. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 75 మంది సబ్-ఇన్స్పెక్టర్లను (ఎస్ఐ) బదిలీ చేస్తూ నగర పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనా సౌలభ్యం, శాంతిభద్రతల పటిష్ఠతలో భాగంగా ఈ బదిలీలు చేపట్టినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లు, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, క్రైమ్, కంట్రోల్ రూమ్ విభాగాల్లో పనిచేస్తున్న అధికారులను ఈ బదిలీల ప్రక్రియలో భాగంగా మార్పు చేశారు. ముఖ్యంగా ఎక్కువ కాలంగా ఒకేచోట పనిచేస్తున్న అధికారులను గుర్తించి వేర్వేరు స్టేషన్లు, విభాగాలకు…