తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రతిష్ఠను దెబ్బతీసేలా, తెలంగాణ సాగునీటి జీవనాడి కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుపై ‘వెలుగు’ దినపత్రిక ప్రచురించిన కథనం నిరాధారమైందని బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్ తీవ్రంగా ఖండించారు. పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు చేసే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a) కల్పించిన భావప్రకటనా స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలని శ్రీధర్ పేర్కొన్నారు. అయితే, ఆర్టికల్ 19(2) ప్రకారం ఈ స్వేచ్ఛకు సహేతుకమైన పరిమితులు, బాధ్యతలు కూడా ఉంటాయని తెలిపారు. కనీస అధికారిక ఆధారాలు, సాగునీటి శాఖ రికార్డులను పరిశీలించకుండా రాజకీయ దురుద్దేశంతో కథనాలు ప్రచురించడం వ్యక్తుల ప్రతిష్ఠకు భంగం కలిగించడమేనని విమర్శించారు.