అర్హులైన ప్రతి పట్టభద్రుడి ఓటు నమోదు కావాలి – నాయకులకు ఎమ్మెల్యే దిశానిర్దేశం
విశాలాంధ్ర,షాద్ నగర్: రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, ఓటరు నమోదు ప్రక్రియపై షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరై మండల, పట్టణ కాంగ్రెస్ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ మండలాల వారీగా పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియ పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….. అర్హులైన ప్రతి పట్టభద్రుడికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించేలా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేసి, అర్హులైన పట్టభద్రులందరూ తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకునేలా…