చైర్మన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి
విశాలాంధ్ర – శామీర్ పేట్ :- అర్హులైన పేదలకు ఇళ్లు అందించాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అలియాబాద్ మున్సిపల్ చైర్మన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని లాల్ గడి మలక్ పేట్ గ్రామంలోని 6వ వార్డులో కావటి సరిత , మురళి దంపతులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరైంది. కాగా నూతనంగా నిర్మించకున్న ఇంటిలో గృహ ప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ పేదింటి వారికి సొంతింటి కల సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఒక సొంతింటి కల నెరవేరిందుకు పేదల కళ్లలో…