దసరా పండుగ మనకు అందించే ప్రధాన సందేశం ఒక్కటే. ఎంతటి శక్తివంతమైన వ్యక్తి అయినా అహంకారం, అన్యాయంతో శాశ్వత విజయం సాధించలేడు. ధైర్యంగా నిలబడి ధర్మం వైపు నడిస్తే విజయం సాధ్యమవుతుందనే నమ్మకాన్ని ఈ పండుగ బలపరుస్తుంది. అందుకే విజయదశమిని కేవలం పండుగగా కాకుండా, జీవితంలో చెడు అలవాట్లను విడిచిపెట్టి మంచి మార్గాన్ని ఎంచుకోవాలని గుర్తుచేసే ప్రత్యేక రోజుగా కూడా భావిస్తారు.
దసరా ఉత్సవాల ప్రాభవం సమాజంలో దాని విశిష్ఠతపై వివిధ సామాజిక వర్గాలు, దళిత సంఘాల నాయకులు తమదైన సామాజిక కోణంలో విశ్లేషిస్తుంటారు. దసరా పండుగ మూల సందేశం చెడుపై మంచి సాధించిన విజయం అని ఎస్సీ సంఘం నాయకుడు టి.బాపన్న చెప్పారు. సమాజంలో శతాబ్దాలుగా వేళ్లూనుకుపోయిన కుల వివక్ష, అంటరానితనం, సామాజిక అసమానతలు అనేవి చెడుకి ప్రతీకలు.