– దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ – 62 మంది లబ్ధిదారులకు రూ.71.92 లక్షల చెక్కుల పంపిణీ
దేవరకొండ, అక్టోబర్ 15 : పేద కుటుంబాల్లో ఆడబిడ్డల వివాహాలు ఆర్థిక భారంగా మారకూడదనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తోందని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. దేవరకొండ, డిండి, నేరేడుగొమ్ము, చందంపేట, కొండమల్లేపల్లి మండలాలకు చెందిన 62 మంది లబ్ధిదారులకు రూ.71,92,000 విలువైన కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం అర్హులైన పేద కుటుంబాలకు సంక్షేమ పథకాల ద్వారా అండగా నిలుస్తోందని తెలిపారు. ఆడబిడ్డల వివాహాల కోసం ఆర్థిక సహాయం అందించడం…