నల్లగొండ, అక్టోబర్ 16 : ప్రొగ్రెసివ్ రికగ్నైస్డ్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా మిర్యాలగూడ నివాసి, ఉపాధ్యాయుడు రాపోలు పరమేశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని జి.ఎం గార్డెన్ లో జరిగిన రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో పీఆర్టీయూ నూతన శాఖను ఎన్నుకున్నారు. ఇందుకు సంబంధించి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భిక్షం గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. పరమేశ్ కేతేపల్లి మండలం భీమవరం ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడుగా పని చేస్తున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. తన ఎన్నికకు సహకరించిన ఎమ్మెల్సీ…
పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా రాపోలు పరమేశ్