పారిస్, అక్టోబర్ 18: ప్రజాందోళనలతో ఫ్రాన్స్ అగ్నిగుండంలా మారింది. పెరుగుతున్న జీవన వ్యయం, పాఠశాలల్లో అధ్వాన పరిస్థితులకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. పారిస్‌లో టియర్‌గ్యాస్ మేఘాలు కమ్ముకోగా, దేశంలోని పలు నగరాల్లో భవనాలు మంటల్లో చిక్కుకున్నాయి. ముసుగులు ధరించిన కొందరు నిరసనకారులు దుకాణాలను ధ్వంసం చేసి, వస్తువులను దోచుకున్నారు.
దేశవ్యాప్తంగా సుమారు 5.5 లక్షల మంది వీధుల్లోకి వచ్చారని, వీరిలో పారిస్‌లోనే 1.10 లక్షల మంది ఉన్నారని ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల మంత్రి లారెంట్ నునెజ్ తెలిపారు. పోలీసులు 1,800 మందికిపైగా నిరసనకారులను అరెస్ట్ చేశారు. ఘర్షణల్లో 150 మంది పోలీస్ అధికారులు గాయపడినట్టు ప్రధానమంత్రి సెబాస్టియన్ లెకొర్ను తెలిపారు. పాఠశాలల్లో పరిస్థితులు దిగజారడాన్ని నిరసిస్తూ విద్యార్థులు ప్రారంభించిన ఆందోళనలు క్రమంగా విస్తృత ఉద్యమంగా మారాయి. ప్రభుత్వ స్పందన పట్ల అసంతృప్తితో ఉన్న కార్మిక సంఘాలు, ఇతర వర్గాలు కూడా ఈ ఉద్యమంలో భాగమయ్యాయి. హింసాకాండను ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఖండించారు. దేశంలో హింసకు చోటులేదని…