మా పిల్లలు హీరోలు కావాలి. 'అందరి పిల్లల్లో మా పిల్లలే బెస్ట్ గా ఉండాలి" అని కోరుకుంటారు పేరెంట్స్. కానీ, దాన్ని సాధించడంలో ఫెయిలవుతారు. పాజిటివ్ పేరెంటింగ్ తో పెంచాల్సిన పిల్లల్ని డిఫరెంట్ గా పెంచుతారు. పిల్లల అవసరాల విషయంలో స్తోమతకు మించి ఖర్చు చేస్తుంటారు. పిల్లలపై, తమకు ఎంత ప్రేమ ఉందో వాళ్లకు తెలియాలని కొంతమంది పేరెంట్స్ ఇలా చేస్తుంటారు. అలాంటి పేరెంట్స్ వారి పిల్లలు అబద్దం చెబితే మాత్రం తట్టుకోలేరు. ఇంత ప్రేమగా చూసుకుంటుంటే అబద్ధాలు చెబుతారా ? అని వాపోతారు.
పిల్లలకు పేరెంట్సే రోల్ మోడల్స్, పేరెంట్స్ కు ఉన్న టాలెంట్, ప్రవర్తనను పిల్లలు ఆటోమెటిక్ గా నేర్చుకుంటారు. ఆ క్వాలిటీస్ ని పెంచు కోవడానికి తెలీకుండానే ట్రై చేస్తారు. ప్రముఖ సైకాలజిస్ట్ క్యాంప్ బెల్ పరిశోధనల ప్రకారం పిల్లల ప్రవర్తనకు పెద్దల పెంపకం 75% కారణమని, మిగతా 25% మీడియా, సొసైటీ, స్కూల్ కారణం. పేరెంట్స్ విజయం సాధిస్తే పిల్లలూ విజయం సాధిస్తారు. అలాగే అబద్ధాలు అయినా, ప్రవర్తన అయినా పేరెంట్స్, మిగతా ఫ్యామిలీ మెంబర్స్ నుంచే పిల్లలు నేర్చుకుంటారు. కోపం, నిరాశ నిస్పృహ, ఆనందం, అబద్ధాలు అన్నింటినీ పేరెంట్స్ నుంచే అలవాటు చేసుకుంటారు. వాటిని ఎలా చెప్పాలో, బాడీ లాంగ్వేజ్ ని కూడా పెద్దలను చూసే…