న్యూఢిల్లీ: ప్లాస్టిక్ వ్యర్థాలతో నాసా అధిక ప్రొటీన్ కలిగిన కుకీలను తయారు చేసింది. నాసా చేపట్టిన ‘డీప్ స్పేస్ ఫుడ్ చాలెంజ్’ ఆర్థిక సహాయంతో సౌథర్న్ ఇల్లినాయిస్ యూనివర్సిటీ కార్బొండేల్ పరిశోధకులు మైక్రోబైట్స్ పేరుతో 3డీ-ప్రింటెడ్, అధిక ప్రొటీన్ కలిగిన కుకీలను అభివృద్ధి చేస్తున్నారు. డీప్ స్పేస్ ఫుడ్ చాలెంజ్ ప్రాజెక్టు భవిష్యత్తు అంతరిక్ష ప్రయోగాలకు తోడ్పడటంతోపాటు చెత్త, ఆహార కొరత సమస్యలకు కొత్త పరిష్కారాలను అన్వేషిస్తున్నది. ఈ కుకీలు తినడానికి సురక్షితమేనని పరిశోధకులు చెప్తున్నప్పటికీ వీటి రుచిని పరీక్షించడానికి ఇంకా సంబంధిత సంస్థల నుంచి అనుమతులు రావాల్సి ఉన్నది.
మైక్రోబైట్స్ అనేవి వ్యర్థ పదార్థాల నుంచి ప్రొటీన్, ఇతర పోషకాలు అందించేలా రూపొందించిన 3డీ ప్రింటెడ్ కుకీలు. సౌథర్న్ ఇల్లినాయిస్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ లాహిరు జయకోడి నేతృత్వంలోని పరిశోధక బృందం మనం సాధారణంగా వాడే నీళ్ల సీసాలు, కూల్‌డ్రింక్ బాటిళ్లలో ఉండే పెట్(పాలిథిలీన్ టెరెప్తలేట్) రకం ప్లాస్టిక్‌ను దీనికోసం ఉపయోగిస్తున్నది. దీంతోపాటు పారేసే మక్కజొన్న దంట్లు, ఆకులు, ఇతర వ్యవసాయ వ్యర్థాలను కూడా ఈ ప్రక్రియలో వాడుతున్నారు. పరిశోధకులు ప్లాస్టిక్‌ను కేవలం పొడిగా నూరి పిండిలో కలపరు. వ్యర్థాలను విచ్ఛిత్తి చేసి, సూక్ష్మజీవులు వాటిని ఆహార పదార్థాలుగా మార్చేలా ఒక ప్రత్యేకమైన…