న్యూఢిల్లీ, అక్టోబర్ 16 : భారతీయ శాటిలైట్ కమ్యూనికేషన్స్ రంగంపై స్టార్‌లింక్ అధినేత ఎలాన్ మస్క్ చేసిన బహిరంగ విమర్శలపట్ల రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) గట్టిగానే స్పందించింది. గతకొద్ది రోజులుగా ఇక్కడి చట్టాలు, విధానాలపై మస్క్ నోరు పారేసుకుంటున్న నేపథ్యంలో రిలయన్స్ శుక్రవారం మౌనం వీడింది. మార్కెట్లో పోటీకి భయపడే ప్రసక్తే లేదని, వినియోగదారులకు ఎవరు అత్యుత్తమ సేవలను అందిస్తారో చూసుకుందామంటూ కౌంటర్ ఇచ్చింది. స్టార్‌లింక్‌తో పోటీని స్వాగతిస్తున్నామని, అయితే ఇక్కడి చట్టాలు, విధానాలు అందరికీ ఒకేలా వర్తిస్తాయని, వాటిని మస్క్ తప్పనిసరిగా గౌరవించాల్సిందేనని పేర్కొన్నది. తమను…
మార్కెట్లో పోటీ పెరిగితే శాట్‌కామ్ వినియోగదారులకే లాభమని, అయితే పోటీ లేకుండా అడ్డుకుంటున్నారని మస్క్ అంటున్నారు. ఈ క్రమంలోనే ‘మేము పోటీకి ఎప్పుడూ భయపడబోం. నిజానికి కస్టమర్‌కు ఎవరు అత్యుత్తమ సర్వీసును అందిస్తారు అన్నదానికి అసలైన పరీక్ష మార్కెట్ కాంపిటీషనే’ అని ఓ ప్రకటనలో ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పష్టం చేసింది. 2016లో భారతీయ టెలికాం మార్కెట్లోకి జియో ప్రవేశించిందని, అప్పుడు ఎంతో పోటీ ఉన్నదని, అయినప్పటికీ అత్యుత్తమంగా, ఆకర్షణీయ రీతిలో చౌకగా సేవలను అందించి పదేండ్లలో 53 కోట్లకుపైగా కస్టమర్లను పొందగలిగామని గుర్తుచేసింది. దేశంలోని ప్రతి సంస్థలాగే రిలయన్స్ కూడా…