విశాలాంధ్ర -అనంతపురం టౌన్ : ఆధునిక మానవ శరీర నిర్మాణ శాస్త్ర పితామహుడిగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ శరీర నిర్మాణ శాస్త్రవేత్త డాక్టర్ ఆండ్రియాస్ వెసాలియస్ జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం అక్టోబర్ 15న నిర్వహించే ప్రపంచ శరీర నిర్మాణ శాస్త్ర దినోత్సవాన్ని, గురువారం ప్రభుత్వ వైద్య కళాశాల, అనంతపురములోని శరీర నిర్మాణ శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలు శరీర నిర్మాణ శాస్త్ర విభాగాధిపతి మరియు ఆచార్యులు డాక్టర్ ఎస్. ఉమామహేశ్వరరావు అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ఎం. విజయశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ… వైద్య విద్యలో మానవ శరీర నిర్మాణ శాస్త్రం…