సిద్దిపేట, అక్టోబర్ 15 : ఆపద సమయంలో ఆదుకొనే రైతుబీమా పథకాన్ని వెంటనే అమలుచేయకపోతే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు హెచ్చరించారు. రైతుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తూ, కేసీఆర్ అమలుచేసిన సంక్షేమ పథకాలను నిలిపివేసి వాళ్ల ఉసురుపోసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. నియోజకవర్గంలో రైతుబీమా అందని 22 మంది కుటుంబాలతో గురువారం సిద్దిపేటలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన సమావేశమయ్యారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ ఆగస్టు 15నుంచి ఇప్పటివరకు ఒక సిద్దిపేటలో 22మంది, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3వేల మంది రైతులు మృతిచెందారని, ప్రభుత్వం…
రైతుబీమా అమలు చేసి ఉంటే అన్ని కుటుంబాలు ఎందుకు కన్నీళ్లు పెడుతాయని ప్రశ్నించారు. ప్రభుత్వం ఆగస్టు 14నుంచి ఎల్ఐసీకి ప్రీమియం చెల్లించకపోవడం వల్లే రాష్ట్రంలో రైతుబీమా ఆగిపోయిందని చెప్పారు. మరి ఇప్పుడు వారికి ఏం సమాధానం చెబుతారని, ప్రభుత్వం ఎలా ఆదుకుంటుందో చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఐక్యరాజ్యసమితి సైతం మెచ్చుకున్న రైతు బీమా పథకాన్ని నిలిపివేయడానికి ప్రభుత్వానికి మనసెలా వచ్చిందని ధ్వజమెత్తారు. ఇతర రాష్ట్రాలు మన పథకాన్ని చూసి అమలు చేస్తుంటే.. ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం బంద్ చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతు సంక్షేమం గురించి గొప్పలు చెప్పే రేవంత్‌రెడ్డికి రూ.1,400 కోట్ల…