కేంద్ర విదేశాంగ శాఖకు సుప్రీంకోర్టు ఆదేశాలురష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో బలవంతంగా పాల్గొని ప్రాణాలు కోల్పోయిన భారతీయుల కుటుంబాలకు అండగా నిలవాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మృతుల కుటుంబాలు రష్యా ప్రభుత్వం నుంచి నష్టపరిహారం పొందేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని విదేశాంగ శాఖను ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం కోర్టుకు సమర్పించిన నివేదిక ప్రకారం, ఉద్యోగాల పేరుతో మోసగించి 267 మంది భారతీయులను రష్యా సైన్యంలో చేర్పించారు. వీరిలో ఇప్పటికే 51 మంది మరణించినట్లు ధ్రువీకరించారు. దౌత్యపరమైన చర్యల ద్వారా 139 మందిని సురక్షితంగా వెనక్కి తీసుకురాగా, మరో 77 మంది ఆచూకీ ఇంకా…
మరణించిన వారి కుటుంబ సభ్యులు పరిహారం కోసం దరఖాస్తు చేసుకునేలా విదేశాంగ శాఖ విస్తృత ప్రచారం కల్పించాలని సుప్రీంకోర్టు సూచించింది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థల ద్వారా బాధిత కుటుంబాలకు ఉచిత న్యాయ సహాయం అందించాలని ఆదేశించింది. క్లెయిమ్ దాఖలు, డీఎన్ఏ పరీక్షలు, మృతదేహాల తరలింపునకు సంబంధించిన సంక్లిష్టమైన పత్రాల తయారీలో ఈ సహాయం ఉపయోగపడుతుంది.