విదేశాలకు నిధుల మళ్లింపుపై ఇడి దర్యాప్తు
న్యూఢిల్లీ: కార్పొరేట్ దిగ్గజం అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) తీవ్ర చర్యలు చేపట్టింది. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘనల ఆరోపణలపై రూ.2,032.81 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. ఇందులో రిలయన్స్ పవర్ కంపెనీ బ్యాంకు ఖాతాల్లోని నిల్వలతోపాటు సాసన్ పవర్ లిమిటెడ్‌లో సంస్థకున్న వాటాలు ఉన్నాయి. విదేశీ మారక నగదును నిబంధనలకు విరుద్ధంగా విదేశాల్లో ఉంచినట్లు గుర్తించిన నేపథ్యంలో.. అందుకు సమానమైన విలువగల భారత్‌లోని ఆస్తులను ఫెమా చట్టంలోని సెక్షన్ 37ఎ కింద స్వాధీనం చేసుకున్నట్లు ఇడి వెల్లడించింది. విదేశీ పెట్టుబడులు, అడ్వాన్సుల…