Saluru | రాజకీయాల్లో ఎప్పుడు ఏ సమీకరణం మారుతుందో చెప్పలేం! పదవి కోసం వేసిన ఎత్తుగడలు ఒక్కోసారి అనూహ్య మలుపులు తిరుగుతుంటాయి. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో టీడీపీ నేత వైకుంఠపు హర్షవర్ధన్ వ్యవహారం ఇప్పుడు స్థానికంగా ఆసక్తికర చర్చకు దారితీసింది. మున్సిపల్ చైర్పర్సన్ పదవిని బీసీ మహిళకు కేటాయించడంతో తన ఎనిమిదేళ్లుగా ప్రేమించిన గుళ్ల మంజీరాను ఉన్నఫళంగా పెళ్లి చేసుకున్న ఆయనకు.. చివరకు ఆ పదవి జనసేన పార్టీకి దక్కడం ఊహించని పరిణామంగా మారింది.
సాలూరు మున్సిపల్ చైర్పర్సన్ పదవిని బీసీ మహిళకు కేటాయిస్తూ రిజర్వేషన్ ఖరారు కావడంతో, ఈ పదవిపై ఆశలు పెట్టుకున్న పలువురు పురుష నేతలకు నేరుగా పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో టీడీపీ మాజీ కౌన్సిలర్ హర్షవర్ధన్ తన రాజకీయ భవిష్యత్తుపై కొత్తగా ఆలోచించినట్లు ప్రచారం సాగింది. తాను పోటీ చేయలేకపోయినా, తన భార్యను బరిలోకి దింపితే పదవిని దక్కించుకోవచ్చనే ఆలోచనతో ఆయన అడుగులు వేసినట్లు స్థానికంగా చర్చ జరిగింది. ఈ క్రమంలోనే తన ప్రియురాలు మంజీరాను పెళ్లి చేసుకుని, ఆమెను ఎన్నికల్లో నిలబెట్టాలని ఆశపడ్డారు. మరో ఆరు నెలల తర్వాత వివాహం చేసుకోవాలని తొలుత నిర్ణయించుకున్న ఈ జంట.. రిజర్వేషన్ ప్రకటన…