సైఫాబాద్, వెలుగు : ఎస్ఐఆర్ ను రద్దు చేయాలని, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ను తొలగించాలని హైదరాబాద్లోని లిబర్టీ నుంచి బీఆర్కే భవన్లోని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆఫీసు వరకు బుధవారం ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నిరసన ప్రదర్శన నిర్వహించాయి.
బారికేడ్లను దాటి ఆఫీసులోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ సందర్భంగా నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్ట లక్ష్మణ్, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మర్రి శ్రీమాన్, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేర్లేకంటి శ్రీకాంత్ పాల్గొన్నారు.