హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (ఉప్పల్) వేదికగా జరుగుతున్న నాలుగో టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్ బ్యాటర్లు చెలరేగిపోయారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన విండీస్ జట్టు ఉప్పల్ పిచ్‌పై పరుగుల సునామీ సృష్టించింది. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 3 వికెట్ల నష్టానికి ఏకంగా 247 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత జట్టు ముందు 248 పరుగుల టార్గెట్ పెట్టింది.
కెప్టెన్ షాయ్ హోప్ సెంచరీ.. రూథర్‌ఫోర్డ్ మెరుపులు