గండిపేట, వెలుగు: శంషాబాద్ యాక్సిస్ బ్యాంకు ఏటీఎంను అక్టోబర్6న గ్యాస్ కట్టర్‌తో కట్‌చేసి సుమారు రూ.ఏడున్నర లక్షలు ఎత్తుకెళ్లిన దొంగల్లో ప్రధాన నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసు ఛేదించడంలో శంషాబాద్ పోలీసులకు రాజస్థాన్ పోలీసులు సహకరించారు. శంషాబాద్ జోన్ డీసీపీ బి.రాజేష్ వివరాలు వెల్లడించారు. అక్టోబర్ 6న తెల్లవారుజామున శంషాబాద్ పరిధిలోని సాతంరాయి యాక్సిస్ బ్యాంకు ఏటీఎంను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గ్యాస్‌కట్టర్‌తో కట్‌చేసి రూ.7.40 లక్షలు కొల్లగొట్టారు.
తాము దొరకూడదని చోరీకి ముందు సీసీటీవీ కెమెరాలపై పెయింట్ స్ప్రే చేసి, అలారం వైర్ కత్తిరించారు. శంషాబాద్పీఎస్లో కేసు నమోదు కాగా టాస్క్‌ఫోర్స్ పోలీసులతో కలిసి దర్యాప్తు చేపట్టారు. అయితే, మరో దొంగతనం చేయడానికి ప్రధాన నిందితుడు సిటీకి రాగా శంషాబాద్గొల్లపల్లి ఎక్స్ రోడ్స్ వద్ద పోలీసులు వల వేసి పట్టుకున్నారు. అయితే, తమ గ్యాంగ్అంతా డబ్బులను పంచుకోగా, తనకు రూ.90 వేలు వచ్చిందని, అందులో రూ.85,500 ఖర్చయ్యాయని, తన వద్ద రూ.4,500 మాత్రమే మిగిలాయని నిందితుడు పోలీసులకు విచారణలో వెల్లడించాడు. నగదు, కారు, బైక్, గ్యాస్‌కట్టర్, సిలిండర్, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.