విశాలాంధ్ర, జూబ్లీహిల్స్ : జూబ్లీహిల్స్ నియోజకవర్గం, బిఆర్ఎస్ ఇన్చార్జ్ మాగంటి సునీత గోపీనాథ్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం షేక్పేట్ డివిజన్ లో గుట్ట పోచమ్మ దేవాలయం గ్రౌండ్స్ లో వైభవంగా జరిగిన బతుకమ్మ సంబరాలు. షేక్పేట్ డివిజన్ ప్రజలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వర్గీయ మాగంటి గోపీనాథ్ ప్రతి సంవత్సరం ప్రజలతో కలిసి బతుకమ్మ పండుగను జరిపే వారని ఆయన లేని లోటు ఎప్పటికీ తీర్చలేనిదని ఆయన సతీమణిగా ఆయన ప్రారంభించిన కార్యక్రమాలను ప్రతి సంవత్సరం కొనసాగిస్తానని అన్నారు. ఈ కార్యక్రమాలు ఏ రాజకీయ లబ్ధి కోసం కాదు, ఏ పదవి కోసం కాదు! గోపీనాథ్ ఎక్కడికి వెళ్లిపోలేదు, మీరు జరుపుకునే ప్రతి పండుగలో…