తిరుమల శ్రీవారి దర్శనం, వసతి గదుల కోటాకు సంబంధించి కీలక అప్ డేట్ విడుదల చేసింది టీటీడీ. 2027 జనవరి నెల దర్శన, వసతి గదుల కోటాకు సంబంధించిన వివరాలు వెల్లడించింది టీటీడీ.
శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల(సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) కు సంబంధించిన కోటాను అక్టోబర్ 19న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు తెలిపింది టీటీడీ.ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని తెలిపింది. ఈ టికెట్లు పొందిన వారు 21 నుండి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి టికెట్లు మంజూరవుతాయి.