పెద్దపల్లి, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): సింగరేణిలో వృథా ఖర్చులకు అడ్డూ అదుపు లేకుండా పోతున్నది. కార్మికుల సంక్షేమాన్ని గాలికొదిలిన యాజమాన్యం, ప్రభుత్వ ప్రచార ఆర్భాటానికి పెద్దపీట వేస్తూ కార్మికులకు తీవ్రనష్టం చేస్తున్నది. ఏటా సింగరేణి కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పేరిట కరపత్రాలు ముద్రించడం ఆనవాయితీ. కానీ, ఈ యేడాది డిప్యూటీ సీఎం, రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఫొటో తో కాంగ్రెస్ పార్టీ మూడు రంగుల బార్డర్తో సింగరేణి సొమ్ము రూ.లక్షలు ఖర్చు పెట్టి ఆయిల్ ప్రింట్ కరపత్రాలను ముద్రించడం విమర్శలకు తావిస్తున్నది. చెమటను…
ఇదేం అన్యాయం? సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి శుభాకాంక్షలు తెలియజేయడం ఆనవాయితీగా వస్తున్నది. కానీ, ఈ యేడాది గతంలో ఎన్నడూ లేని విధంగా డిప్యూటీ సీఎం పేరిట నాలుగు పేజీల కరపత్రాన్ని ముద్రించి పంపింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార మూడేండ్లుగా హామీలు ఇస్తూ దాటవేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మూడు రంగులతో ఆయిల్ పెయింట్తో నాలుగు పేజీల కరపత్రాలను పంచడం సింగరేణి సొమ్ముతో సర్కారు సోకులు పడుతున్నట్టుగా ఉన్నది. – మిర్యాల రాజిరెడ్డి, టీబీజేకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు