శివ్వంపేట : తెలంగాణ సంస్కృతి ( Sunitha Lakshma Reddy) , సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ( Bathukamma ) ప్రతీకగా నిలుస్తుందని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి ( Sunitha Lakshma Reddy) అన్నారు. ఆదివారం తన నివాసంలో సద్దుల బతుకమ్మను తీరొక్క పూలతో కుటుంబ సభ్యులతో కలసి అందంగా అలంకరించారు. వివిధ రకాల రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి పండుగ శోభను చాటారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి,సంస్కృతి ,సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ పూలతో జరుపుకునే పండుగ తెలంగాణలో ప్రత్యేకతను చాటుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ సాంప్రదాయాలను కాపాడుకుంటూ బతుకమ్మ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.