సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా కోర్ట్ అసిస్టెంట్ (టెక్నికల్ అసిస్టెంట్-కం -ప్రోగ్రామర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టు పేరు: కోర్ట్ అసిస్టెంట్ (టెక్నికల్ అసిస్టెంట్ – కం – ప్రోగ్రామర్) మొత్తం ఖాళీలు: 15.
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీఈ/ బి.టెక్తోపాటు సాఫ్ట్వేర్ అభివృద్ధిలో మూడేళ్ల అనుభవం ఉండాలి. లేదా ఎంసీఏ లేదా కంప్యూటర్ సైన్స్లో ఎంఎస్సీ పూర్తిచేసి, సాఫ్ట్వేర్ అభివృద్ధిలో మూడేళ్ల అనుభవం ఉండాలి. లేదా కనీసం 60 శాతం మార్కులతో కంప్యూటర్ సైన్స్లో బీఎస్సీ లేదా బ్యాచిలర్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సాఫ్ట్వేర్ అభివృద్ధిలో నాలుగేళ్ల అనుభవం ఉండాలి.