అఖిల భారత స్విమ్మింగ్ ఫెడరేషన్ కప్ 2026 పోటీల్లో కెబిఎన్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో ఒక బంగారు, మూడు రజత, ఒక కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారు. బుధవారం కళాశాలలో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ జి.కృష్ణవేణి ఈ వివరాలను వెల్లడించారు. మొదటి సంవత్సరం బి.కాం కంప్యూటర్స్ విద్యార్థి పి.కిరణ్ 400 మీటర్ల ఫ్రీ స్టైల్ విభాగంలో బంగారు పతకం, 200 మీటర్ల ఫ్రీ స్టైల్ లో రజత పతకం, 100 మీటర్ల ఫ్రీ స్టైల్ లో కాంస్య పతకంతో పాటు సర్ఫేస్ రిలే 4x50 మీటర్ల విభాగంలో రజత పతకం సాధించాడు. అలాగే బిబిఎ మొదటి సంవత్సరం చదువుతున్న టి.పృధ్వి ప్రసాద్ 4x100 సర్ఫేస్ రిలే విభాగంలో రజత…