హైదరాబాద్, వెలుగు: సర్కారు బడుల్లో మరుగు దొడ్ల సమస్యను సమూలంగా పరిష్కరించేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. సమగ్ర శిక్షా అభియాన్ కింద మొత్తం రూ.208.91 కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా 3,746 స్కూళ్లలో 4,355 కొత్త టాయిలెట్ యూనిట్లు నిర్మించబోతున్నది. ఈ 2026–27 విద్యా సంవత్సరం నాటికి ఏ ఒక్క బడిలోనూ టాయిలెట్ల కొరత ఉండకూడదన్న లక్ష్యంతో వంద శాతం ‘శానిటేషన్ శాచురేషన్’సాధించే దిశగా చర్యలు చేపట్టింది.
సర్కారు బడుల్లో బాలికలు ప్రైమరీ లెవల్ నుంచి హైస్కూల్‌కు వచ్చేసరికి డ్రాపౌట్లు పెరిగిపోవడానికి ప్రధాన కారణం ‘టాయిలెట్ల లేమి’అని క్షేత్రస్థాయి పరిశీలనల్లో తేలింది. నెలసరి సమయంలో పడే ఇబ్బందులు, కనీస నీటి సౌకర్యం లేకపోవడంతో వేలాది మంది బాలికలు రోజువారీ తరగతులకు గైర్హాజరవుతున్నారు. చాలాచోట్ల బడి మానేసే పరిస్థితి నెలకొంది. ఈ దుస్థితిని రూపుమాపేందుకు బాలికల కోసం ప్రత్యేకంగా రూ.57.17 కోట్లు, బాలుర కోసం రూ.151.74 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ప్రతి బడిలోనూ విద్యార్థుల నిష్పత్తికి తగినట్లుగా ప్రత్యేకంగా బాలుర, బాలికల మూత్రశాలలు, మరుగుదొడ్లు నిర్మించనున్నారు. రాష్ట్రంలో శానిటేషన్…