బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ పై జరిగిన కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ముంబై పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా.. వీరిలో ఒకరు 'ర్యాపిడో'లో బైక్-టాక్సీ రైడర్‌గా పని చేసినట్లు తేలింది.
ఘటనలో ర్యాపిడో పాత్ర ఏంటి? అరెస్ట్ అయిన ముగ్గురు నిందితులలో హ్రితిక్ కుర్మి అలియాస్ రోషన్ ఫైటర్ (22) ఒకరు. ఇతను గతంలో ర్యాపిడో ప్లాట్‌ఫారమ్‌లో 'కెప్టెన్'గా రిజిస్టర్ అయ్యాడు. నిందితుడు ఇదే సాకుతో టైగర్ ష్రాఫ్ ఇల్లు ఉన్న జుహు ప్రాంతంలో రెక్కీ నిర్వహించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అయితే ఈ ఘటనకు ర్యాపిడో కంపెనీకి ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధం లేదు. గిగ్ ఎకానమీలో సర్వసాధారణంగా జరిగేలా.. సదరు వ్యక్తి ఒకే సమయంలో అనేక ప్లాట్‌ఫారమ్‌లలో రిజిస్టర్ అయి ఉండవచ్చని తేలింది.