హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ దవాఖాన్లలో కాన్పుల వేళ తల్లీబిడ్డల ప్రాణాలు కాపాడేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అందుబాటులోకి రానుంది. పురిటి నొప్పులతో అల్లాడే గర్భిణి పక్కన నర్సో, డాక్టరో క్షణక్షణం లేకపోయినా.. కడుపులోని బిడ్డ గుండె చప్పుడు, ఆక్సిజన్ స్థాయిల్లో తేడాలను పసిగట్టి డాక్టర్లను అప్రమత్తం చేయనుంది. కాన్పు మొదలైనప్పటి నుంచి బిడ్డ సురక్షితంగా బయటకు వచ్చే వరకు ఎదురయ్యే ప్రతి సంక్లిష్టతను రియల్ టైమ్‌లో పర్యవేక్షించేందుకు లేబర్ రూమ్‌లలో డిజిటల్ స్క్రీన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ కొత్త విధానానికి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, త్వరలోనే రాష్ట్రంలోని ప్రభుత్వ…
ఇన్నాళ్లూ ప్రసవ గదుల్లో గర్భిణుల ఆరోగ్య పరిస్థితిని మాన్యువల్‌గా పల్స్, బీపీ చూసి పేపర్లపైనే నమోదు చేసేవారు. వార్డుల్లో రద్దీగా ఉన్నప్పుడు రీడింగ్స్ నమోదు చేయడంలో కాస్త ఆలస్యమైనా, చిన్న మార్పులను గుర్తించలేకపోయినా.. బిడ్డ కడుపులోనే శ్వాస ఆడక చనిపోవడం (స్టిల్‌బర్త్), లేదా కాన్పు కాగానే తల్లికి తీవ్ర రక్తస్రావమై ప్రాణాల మీదకు రావడం వంటి పరిస్థితులు ఉండేవి. వీటికి అడ్డుకట్ట వేసేందుకు అత్యాధునిక కార్డియోటోకోగ్రఫీ (సీటీజీ) మెషిన్ల ద్వారా తల్లికి వచ్చే నొప్పుల తీవ్రతను, బిడ్డ గుండె వేగాన్ని ఏకకాలంలో డిజిటల్ స్క్రీన్‌పై రికార్డు చేస్తాయి. ఈ గ్రాఫ్ లను సాధారణ కంటితో చూసి అంచనా వేయడం…