తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈ నెల 15 నుంచి 18వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశాలున్నాయని తెలిపింది.గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది.రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల నిష్క్రమణ కొనసాగుతోంది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాల నిష్క్రమణ రేఖ తెలంగాణలోని ఖమ్మం జిల్లా మీదుగా వెళ్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.మరోవైపు ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని వివరించింది.
వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాలుభద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.ఈ జిల్లాల ప్రజలు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది.