నగోయా: ఆసియా పారా క్రీడల్లో ఇండియాకు అద్భుతమైన ఆరంభం లభించింది. సోమవారం జరిగిన పారా అథ్లెటిక్స్‌లో మనోళ్లు మూడు స్వర్ణాలు, రెండు రజతాలు, ఒక కాంస్యతో కలిపి ఏకంగా ఆరు పతకాలు సాధించారు. మెన్స్ లాంగ్ జంప్ టీ–-47 విభాగంలో నిషాద్ కుమార్ అద్భుత ప్రదర్శనతో తొలి స్వర్ణాన్ని అందించాడు. తన మూడు, ఐదో ప్రయత్నంలో 7.11 మీటర్ల దూరం దూకి టాప్ ప్లేస్‌లో నిలిచాడు. ఒమద్బెక్ (6.99 మీ, ఉజ్బెకిస్తాన్), మొహమ్మద్ సఫ్రాన్ (6.55 మీ, శ్రీలంక) వరుసగా సిల్వర్, బ్రాంజ్ నెగ్గారు. చిన్నతనంలో గడ్డి కోసే యంత్రం తగలడంతో నిషాద్ కుడి చేతిని కోల్పోయాడు. విమెన్స్…
ఆసియా పారా క్రీడల ఆర్చరీ విభాగంలో ఇండియా సంచలనం శీతల్ దేవి రికార్డుల మోత మోగించింది. విమెన్స్ కాంపౌండ్ క్వాలిఫికేషన్ రౌండ్లో వరల్డ్ రికార్డును సమం చేసిన శీతల్, మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో తోమన్ కుమార్‌తో కలిసి మరో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. చేతులు లేకపోయినా కాళ్లతో విల్లును సంధించి, భుజం, దవడ సాయంతో బాణాన్ని వదిలే అద్భుత ప్రతిభావంతురాలైన శీతల్.. విమెన్స్ కాంపౌండ్ ర్యాంకింగ్ రౌండ్లో మొత్తం 720కి గాను 704 పాయింట్లు సాధించి వరల్డ్ రికార్డును సమం చేసింది. ఇదే క్రమంలో కొత్త ఆసియా రికార్డును నమోదు చేసింది. టర్కీకి చెందిన ఓజ్నూర్ గిర్డి 2024 పారిస్…