TOMCOM | హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ) : టామ్కామ్తో ఉద్యోగాలు కల్పిస్తామని తెలంగాణ సర్కార్ భరోసానివ్వడంతో ఆ సంస్థపై నమ్మకం పెట్టుకున్నామని, చివరికి మోసపోయామని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగం కచ్చితంగా వస్తుందని డబ్బులు కట్టించుకొని తమను మోసం చేశారని ఆరోపించారు. కార్మికశాఖ మంత్రి గడ్డం వివేక్.. టామ్కామ్ జర్మన్ భాషా కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ.. చకగా శిక్షణ పొందిన వారికి మంచి ఉద్యోగాలు కల్పించే బాధ్యత టామ్కామ్, తనపైన ఉన్నదని చెప్పారు. అయితే అందులో శిక్షణ పొందినవారికి ఉద్యోగాలు దక్కకపోవడంతో ఇప్పుడు సర్కార్పై ఆగ్రహం…
రాష్ట్ర ప్రభుత్వ సంస్థ, కీలకమైన విదేశీ ఉపాధి కార్యక్రమాల్లో ఒకటైన తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ(టామ్ కామ్) ద్వారా నడుస్తున్న జర్మన్ భాషా కార్యక్రమంలో అతను చేరాడు. దీని మొదటి బ్యాచ్ ఈ కోర్సు కోసం రూ. 4.1 లక్షలు చెల్లించాల్సి ఉన్నది. ప్రవేశ సమయంలో జర్మన్ బి1 లెవెల్ పాస్ అయితే ఉద్యోగం ఇప్పిస్తానని హెచ్ఆర్ శ్రావణి హామీ ఇచ్చినట్టు తెలిపాడు. అయితే అతడికి ఎలాంటి ఉద్యోగం దక్కలేదని వాపోయాడు. అక్టోబర్ 2024 నుంచి జనవరి 2025 మధ్యకాలంలో టామ్ కామ్ టెక్నికల్, ఫుడ్ టెక్నీషియన్, హాస్పిటాలిటీ, లాజిస్టిక్స్ విభాగాల్లోని ఆస్బిల్డుంగ్ (జర్మన్ వృత్తి విద్యా శిక్షణ) కార్యక్రమాల్లో చేరిన…