హైదరాబాద్: సద్దుల బతుకమ్మ పండగకు హైదరాబాద్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అక్టోబర్ 18న ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ట్యాంక్ బండ్పై ప్రభుత్వ ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. బతుకమ్మ ఉత్సవాల నేపథ్యంలో ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ పరిసరాల్లో ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆదివారం (అక్టోబర్ 18) మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్యాంక్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. జిల్లాల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు, సిటీ బస్సులకు ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేశారు.