Vaibhav Sooryavanshi: భారత టీ20 జట్టులో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi)ని వరుసగా బెంచ్ మీదనే కుర్చొబెట్టడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వెస్టిండీస్‌తో ఇటీవల ముగిసిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఒక్క మ్యాచ్‌లోనూ వైభవ్‌కు తుది జట్టు (Playing XI) లో ఆడే అవకాశం దక్కలేదు. ఈ ఏడాది జూలైలో ఇంగ్లాండ్‌పై అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగేట్రం చేసిన సూర్యవంశీ, స్వదేశంలో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. ఐర్లాండ్, అఫ్ఘనిస్థాన్, జపాన్, వెస్టిండీస్ సిరీస్‌లలో అతను బెంచ్ కే పరిమితమయ్యాడు.
ఓపికతో వేచి చూడాల్సిందే: శ్రేయస్