దేశ వ్యాప్తంగా దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బోడుప్పల్ బంగారు మైసమ్మ మహంకాళేశ్వర స్వామి దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తొమ్మిది రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో శనివారం ( అక్టోబర్ 17) బంగారు మైసమ్మ తల్లి .. మహాలక్ష్మి దేవిగా భక్తులను ఆశీర్వదించారు.
బోడుప్పల్ బంగారు మైసమ్మ మహంకాళేశ్వర దేవాలయంలో దసరా ఉత్సవాల సందర్భంగా వేద పండితులు.. ఆలయ చైర్మన్ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా పూజలు జరుగుతున్నాయి. నిత్యం హోమాలు.. ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. నిత్యం లలితాసహస్రనామ పారాయణం.. హోమాలు.. నీరాజన.. మంత్ర పుష్పాలు , తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం (అక్టోబర్17) బోడుప్పల్ బంగారు మైసమ్మ మహంకాళేశ్వర దేవాలంలో చండిహోమంతో పాటు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ పూజా కార్యక్రమంలో మహిళలు విరివిగా పాల్గొన్నారు.