ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : దాచేపల్లి మున్సిపాలిటీ చైర్మన్‌గా పోటీ చేయనున్న వైసిపి అభ్యర్థి కొప్పుల రవికుమార్ నామినేషన్‌కు ఎటువంటి ఆటంకాలు సృష్టించవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. అక్రమ మద్యం కేసు పెట్టి అరెస్టు చేసి రవికుమార్‌ను జైలుకు పంపిన విషయం తెలిసిందే. పోలీసుల చర్యలను రవికుమార్ బంధువులు గురజాల కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. నామినేషన్లు దాఖలు చేయనివ్వడం లేదని, అక్రమ కేసు పెట్టారని రవికుమార్ తరుఫున న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే కోర్టు జోక్యం చేసుకుని ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఆదివారం నామినేషన్‌కు అవకాశం కల్పించాలని ఎటువంటి ఆటంకాలు…