కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్నికల సంఘం చట్టంలోని కీలక సెక్షన్ 16పై సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. భారత ప్రజాస్వామ్యానికి గుండెలాంటి ఎన్నికల సంఘానికి సంబంధించిన ఈ చట్టం ఇప్పుడు రాజ్యాంగ పరీక్షను ఎదుర్కోబోతోంది. 2023లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ‘చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్ కండిషన్ ఆఫ్ సర్వీస్ అండ్ ఆఫీస్ 2023’లోని సెక్షన్ 16 ప్రకారం - ప్రస్తుత లేదా మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఎన్నికల కమిషనర్లు (ఈసీ) తమ విధి నిర్వహణలో లేదా విధి నిర్వహణలో ఉన్నప్పుడు చేసిన ఏ పనికైనా, మాటకైనా వారిపై ఏ కోర్టులోనూ సివిల్ లేదా క్రిమినల్ కేసు వేయడానికి…
సుప్రీంకోర్టులో పిటిషన్ ఏమిటి?