దేశ భవిష్యత్తు తరగతి గదిలో ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందనే నిజాన్ని నిరూపించే విద్యా విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడంలో సీఎం రేవంత్ రెడ్డి చూపుతున్న చొరవ ప్రశంసనీయం. భారతదేశంలో విద్యాశాఖను తన వద్దే పెట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రిగా అనుక్షణం పర్యవేక్షిస్తూ, దేశ స్థాయిలో 28వ స్థాయిలో అట్టడుగున ఉన్న తెలంగాణ విద్య స్థానాన్ని రెండేళ్లు తిరగకముందే 17వ స్థానానికి చేర్చేలా అనితర ప్రయత్నం చేశారు.
రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుసటి విద్యా సంవత్సరంలోనే విద్యకు బడ్జెట్లో 15 శాతం పైగా నిధులు కేటాయిస్తామన్నారు. కాకపోతే గత ప్రభుత్వం కన్నా మెరుగ్గా బడ్జెట్ కేటాయిస్తూ వస్తున్నారు. బడ్జెట్లో సుమారు 8 శాతం కేటాయించి, కేంద్రం నుంచి గత మూడేళ్లలో వచ్చిన రూ.5వేల కోట్లను విడుదల చేసి ప్రాథమిక, ఉన్నత విద్యకు ధాన్యతనిచ్చారు. సమీకృత, సఫలీకృత విద్యను ప్రపంచీకరణ వైపు పరుగులు తీయిస్తున్నారు. కేవలం 55 రోజుల్లోనే డిఎస్సీ ద్వారా సుమారు10వేలకు పైగా టీచర్ల భర్తీని తక్కువ సమయంలో పూర్తి చేశారు.