విక్టరీ వెంకటేష్ అభిమానులకు మరో మ్యూజికల్ ట్రీట్ వచ్చేసింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆదర్శ కుటుంబం – హౌస్ నంబర్ 47' సినిమా నుంచి రెండో పాట 'మాల' విడుదలైంది. థమన్ స్వరాలు అందించిన ఈ పాటలో వెంకటేష్, నివేదా పేతురాజ్ సందడి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అయితే పాటతో పాటు సినిమా విడుదల తేదీపై కూడా క్లారిటీ వస్తుందని ఆశించిన అభిమానులకు మాత్రం నిరాశే ఎదురైంది.
లేటెస్ట్ గా విడుదలైన 'మాల వచ్చా చూడు' పాటలో వెంకటేష్ తనదైన స్టైల్‌తో అలరించారు. నివేదా పేతురాజ్‌తో కలిసి ఆయన కనిపించిన ఈ రొమాంటిక్ పాటకు థమన్ ఎనర్జిటిక్ సంగీతాన్ని అందించారు. రంగుల హంగులు, ఉత్సాహభరితమైన విజువల్స్‌తో రూపొందిన ఈ సాంగ్ సినిమా ప్రమోషన్లలో కొత్త జోష్ నింపుతోంది.