“ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు” తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత పొడవైన టైటిల్“ఆ నలుగురు”, “అందరి బంధువయా” వంటి హృద్యమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న విలక్షణ దర్శకుడు చంద్ర సిద్ధార్థ్, మరో విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో, ఫిల్మోత్సవ్ బ్యానర్‌పై నిర్మించిన తాజా చిత్రం.. ఁఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు. భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత పొడవైన టైటిల్‌గా నిలుస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 18న విడుదల…
ఈ చిత్రంలో హర్ష హీరోగా పరిచయం అవుతుండగా, అమైరా గోస్వామి, సుజనా రెడ్డి, ఇనాయా సుల్తానా, రవివర్మ, అశోక్‌వర్ధన్, రేఖా నిరోషా కీలక పాత్రలు పోషించారు. జే రెక్స్ సంగీతం అందించిన ఈ చిత్రంలో నాలుగు పాటలు ఉన్నాయి. మానవ సంబంధాలను సున్నితంగా ఆవిష్కరించే చంద్ర సిద్ధార్థ్, ఈసారి ఒక ఆధునిక థ్రిల్లర్‌తో ఎలాంటి మ్యాజిక్ చేస్తారోనని సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.