చుంచుపల్లి, అక్టోబర్ 19 : పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా 1,600 రోజులుగా అవిశ్రాంతంగా మొక్కలు నాటుతున్న వనజీవి విశ్వామిత్ర చౌహాన్ సేవలు అభినందనీయమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ ప్రశంసించారు. వాక్ ఫర్ ట్రీస్ అనే మహా యజ్ఞంలో భాగంగా ఐడిఓసి కార్యాలయం ఆవరణంలో 1,600వ రోజు 1,600 మొక్కగా పింక్ పనస మొక్కను జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ తో కలిసి నాటాడు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. వాతావరణం ఎలా ఉన్నా క్రమం తప్పకుండా ప్రతిరోజూ మొక్కలు నాటడం కష్టతరమైన విషయమని, ఒక కఠోర దీక్ష అని అన్నారు. చిన్న వయసులోనే ఇంతటి పట్టుదలతో పర్యావరణం కోసం పనిచేయడం ప్రతి ఒక్కరికీ…