Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభోత్సవం వాయిదా పడ్డది. దసరా పండుగకు సాప్ట్ లాంచ్ పేరిట ఓపీ సేవలు ప్రారంభిస్తామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియా ముఖంగా ప్రకటించారని తెలిసిందే. అయితే ఇప్పుడు మాత్రం ఊహించని విధంగా వరంగల్ ఆస్పత్రి ప్రారంభోత్సవం వాయిదా పడింది.
24 అంతస్తుల ఆస్పత్రి సాప్ట్ లాంచింగ్‌ను అనివార్య కారణాలతో వాయిదా వేసినట్టు అధికారులు ప్రకటించారు. ట్రయల్ రన్ తర్వాత ఆస్పత్రిని ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. ఓపీ సేవల ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు.. త్వరలోనే ప్రారంభ తేదీని ప్రకటిస్తామని తెలిపారు.