అమరావతి : స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న పరిస్థితులపై సుప్రీం కోర్టు ( Supreme Court ) కు వెళతామని వైసీపీ అధ్యక్షుడు , మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ( Y.S. Jagan ) వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నెలకొన్న దారుణ పరిస్థితులపై ఆదివారం గవర్నర్ అబ్దుల్ నజీర్ ( Governor Abdul Nazeer ) కు వినతిపత్రం అందజేశారు. ఎన్నికలను సజావుగా జరిపించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపక్షాలు నామినేషన్ వేయకుండా పోలీసులు, అధికారుల అండతో అక్రమంగా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అరాచక చర్యల వల్ల అనేక చోట్ల వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయలేకపోయారని విమర్శించారు. వైసీపీ అభ్యర్థుల నుంచి నామినేషన్ల పత్రాలను లాక్కొని చించివేశారని వెల్లడించారు. పట్టణ ప్రాంతాల్లో జరుగు తున్న మున్సిపల్ ఎన్నికల్లో పరిస్థితి ఇలా ఉంటే ఇక గ్రామ స్థాయిలో జరుగనున్న పంచా యతీ ఎన్నికల్లో మరింత దారుణ పరిస్థితులు ఉంటాయమోనని అనుమానం వ్యక్తం చేశారు.