సోషల్ మీడియాలో అమ్మాయిలా నటిస్తూ.. తన వలలో చిక్కినవారిని నగ్న ఫొటోలతో బెదిరింపులకు, బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతూ డబ్బులు డిమాండ్ చేశాడు.. ఇలా అతని వలలో వందలమందికి పైగా పడి మోసపోయారు… ఇందులో ఓ పోలీస్ అధికారి కూడా ఉన్నారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగిన ఈ హనీట్రాప్‌ను చార్మినార్ జోన్ పోలీసులు ఛేదించారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను చార్మినార్ జోన్ డీసీపీ కిరణ్ ప్రభాకర్ ఖరే సోమవారం మీడియాకు వెల్లడించారు. నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టి అతని నేరచరిత్రను వివరించారు. పోలీసులు అరెస్ట్ చేసిన భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన కొండబత్తుల పవన్‌కుమార్ అనే యువకుడు ప్రస్తుతం కూకట్‌పల్లిలోని బాలాజీనగర్‌లో నివాసముంటున్నాడు. కొంతమంది యువతుల పే ర్లతో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ నకిలీ ఖాతాలను సృష్టించి సైదాబాద్‌లో మోసాలకు పాల్పడుతున్నాడు. ఈ ఖాతాల ద్వారా వివిధ వ్యక్తులకు…