2వేల 300 ఉద్యోగాలకు అప్లై చేస్తే ఒక్కటీ రాలే..! జాబ్ మార్కెట్ మరీ ఇంత దరిద్రంగా ఉందా?
V6 Velugu · V6 Velugu · 2 min read at V6 Velugu
నీకేంటిరా మంచిగా చదువుకున్నావ్, మంచి కాలేజీలో ఉన్నావ్ జాబ్ ఇట్టే వచ్చేస్తుంది అనే రోజులు పోయాయ్. ప్రస్తుతం చదువుకుంటే సరిపోదు.. మార్కెట్లో ఉద్యోగం ఉండాలి. మరి నోబెల్ కమిటీనే గుర్తించిన అరుదైన పరిశోధనలు చేసి, అమెరికాలోని అత్యున్నత ప్రిన్స్టన్ యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పూర్తి చేసిన యువకుడికి ఏకంగా 2 వేలకు పైగా దరఖాస్తులు పెట్టినా ఒక్క ఉద్యోగం దక్కకపోతే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుత గ్లోబల్ జాబ్ మార్కెట్ ఎంతలా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుందో చెప్పడానికి జాక్ వైస్ అనే కెమికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కష్టాలే నిదర్శనం.
రైస్ యూనివర్సిటీలో 'సుమ్మా కమ్ లాడ్'తో పట్టా పుచ్చుకుని, ప్రిన్స్టన్లో 2018లో పీహెచ్‌డీలో చేరిన జాక్ వైస్ పరిశోధనల స్థాయి సాధారణమైనది కాదు. ఆయన చేసిన మాలిక్యులర్ ఇంటరాక్షన్స్, ఐస్ ఫార్మేషన్ రీసెర్చ్‌ను ఏకంగా 2024 నోబెల్ బహుమతి ప్రకటన సందర్భంగా నోబెల్ కమిటీ ఉదహరించింది. సైన్స్‌లో AI వాడకానికి ఈయన పనే ఉదాహరణ. కానీ ఇన్ని అర్హతలున్న మేధావి నేడు ఉద్యోగం కోసం సాల్ట్ లేక్ సిటీలోని తన తల్లిదండ్రుల ఇంట్లో తలదాచుకోవాల్సి వస్తోంది.
Excerpt. Full story at V6 Velugu: https://www.v6velugu.com/princeton-phd-graduate-applies-for-2300-jobs-but-still-unemployed-the-brutal-reality-of-job-market
framing not published · 1 outlet covered this story, below the floor for a split