ఆ దేశాల్లో పేదల కంటే తక్కువ సంపాదిస్తున్నోళ్లు ఇండియాలో రిచ్.. వరల్డ్ బ్యాంక్ షాకింగ్ రిపోర్ట్
V6 Velugu · V6 Velugu · 3 min read at V6 Velugu
ఇండియాలో నెలకు రూ.80వేలు సంపాదిస్తున్నారంటే మీరు దేశంలోని టాప్ 10 శాతం సంపన్నుల జాబితాలో ఉన్నట్లే తెలుసా. అవునండీ బాబు వినడానికి ఇది చాలా పెద్దదిగా అనిపించినప్పటికీ.. ప్రపంచ వ్యాప్తంగా ఇతర దేశాలతో బేరీజు వేస్తే మన దేశ ఆర్థిక స్థితిగతుల అసలు రూపం బయటపడతుంది. ప్రపంచ బ్యాంకుకు చెందిన 2026 నాటి పావర్టీ అండ్ ఇన్ఈక్వాలిటీ ప్లాట్ఫామ్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. భారత్లో సంపన్నులుగా భావించే టాప్ 10 శాతం మంది జీవన ప్రమాణాలు, ప్రపంచంలోని అగ్రరాజ్యాల్లోని అత్యంత పేదవారి జీవన ప్రమాణాల కంటే చాలా తక్కువగా ఉన్నాయట. ఒక దేశంలో పైస్థాయిగా ఉన్నదే, మరో దేశంలో అడుగు స్థాయిగా మారుతుందనే పాపులర్ సామెతకు…
పేదరిక నిర్మూలనలో భారత్.. గత దశాబ్ద కాలంలో భారత్ అత్యంత వేగంగా పేదరిక నిర్మూలనలో అద్భుతమైన ప్రగతిని సాధించింది. రోజుకు 3 డాలర్ల అంటే దాదాపు రూ. 285 బెంచ్మార్క్ గా తీసుకుంటే.. దేశంలో పేదరికం 2011-12 నాటికి 27.1 శాతంగా ఉండగా.. 2023-24 నాటికి అది కేవలం 2.6 శాతానికి పడిపోయింది. అలాగే దిగువ-మధ్య ఆదాయ పరిమితి అయిన రోజుకు 4.2 డాలర్లు అంటే రూ. 400 కంటే దిగువన ఉన్నవారు 57.7 శాతం నుంచి 16.1 శాతానికి తగ్గిపోయారు. దీనివల్ల దాదాపు 50 కోట్ల మంది పావర్టీ రేఖను దాటి పైకి రాగలిగారు. ఆహార భద్రత, ప్రభుత్వ సబ్సిడీలు, మౌలిక వసతులు మెరుగుపడటం ఇందుకు ప్రధాన కారణం.
Excerpt. Full story at V6 Velugu: https://www.v6velugu.com/why-india-richest-10-live-below-the-standards-of-the-poor-in-developed-nations
framing not published · 1 outlet covered this story, below the floor for a split