ఆ రోజు విమానంలో అసలేం జరిగింది..? పిన్ టూ పిన్ వివరించిన పైలట్ స్మిత్ మచ్చర్
V6 Velugu · V6 Velugu · 2 min read at V6 Velugu
న్యూఢిల్లీ: ఫ్లైదుబాయ్ విమానంలో జరిగిన భయానక దాడి గురించి కెప్టెన్ స్మిత్ మచ్ఛార్ తొలిసారి స్పందించారు. ఆ రోజు విమానంలో తనపై జరిగిన దాడి, ప్రాణం కోసం చేసిన పోరాటం, ప్రయాణికులు ఆందోళన, ఇతర పైలట్లు విమానాన్ని సేఫ్‌గా ల్యాండింగ్ చేయడం వంటి విషయాలను స్కై న్యూస్ అరేబియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పిన్ టూ పిన్ వివరించారు. ఒమన్‌కు చెందిన కో పైలట్ చేసిన దాడిలో తీవ్రంగా గాయపడ్డ తాను స్పృహ కోల్పోకుండా పోరాడుతూ.. బ్రతుకుతానో లేదోనని ఆందోళన చెందానని మచ్చర్ తెలిపారు. కానీ ప్రయాణికులను రక్షించడం కోసం ఎలాగైనా ప్రాణాలతో ఉండాలని కోరుకున్నానని చెప్పారు.
‘‘విమానం దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు వెళ్తుండగా ఫ్లైట్‌లో ఉన్న ఒమన్‌కు చెందిన కో పైలట్ తనపై వెనక నుంచి గొడ్డలితో దాడి చేశాడు. ఈ దాడిలో తలకు తీవ్రంగా గాయమైంది. ప్రాణాలకు తెగించి అతనితో పోరాడా. తనలోని శక్తినంతా కూడగొట్టుకుని ఎలాగోలా కాక్ పిట్ డోర్ ఓపెన్ చేశా. కాక్‌పిట్ తలుపు తెరిచిన తర్వాత విమానంలో తీవ్ర భయాందోళనలు, కేకలు వినిపించాయి.
Excerpt. Full story at V6 Velugu: https://www.v6velugu.com/captain-smit-machchhar-recounts-terrifying-flydubai-flight-assault
framing not published · 1 outlet covered this story, below the floor for a split