ఆర్టీసీ ‘దసరా’ దోపిడీ!
Namasthe Telangana · NT News telugu · 2 min read at Namasthe Telangana
హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): పండగలు వస్తే చాలు ఆర్టీసీ స్పెషల్ బస్సుల పేరుతో ప్రయాణికులను దోచుకుంటున్నది. దసరా పండక్కి రద్దీ పెరుగడంతో దూరంతో సంబంధం లేకుండా ఇప్పటికే ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో ఏకంగా 50 శాతం టికెట్ ధరను పెంచి ప్రయాణికుల నుంచి ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నది. ఉప్పల్ నుంచి తొర్రూర్కు సూపర్ లగ్జరీ టికెట్ ధర గతంలో రూ.300 వరకు ఉండగా.. 50 శాతం అదనపు పెంపుతో రూ.430కి పెరిగింది. మహబూబ్నగర్ నుంచి ఎంజీబీఎస్కు సూప ర్ లగ్జరీ ధర మొన్నటివరకు రూ.220 ఉండ గా.. ఇప్పుడు రూ.290 పైగా వసూలు చేస్తున్నారు.
దసరా పండుగ ఉత్సాహంతో బస్కెక్కినవారికి.. టికెట్ రేట్లు చూడగానే ఆనందం ఆవిరైపోతున్నది. పండక్కు ఇంటికి వెళ్లాలనుకున్న తమను అదునుచూసి ఆర్టీసీ సంస్థ నిలువుదోపిడీ చేస్తున్నదని పలువురు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణ రోజుల్లో టికెట్ ధర రూ.100 ఉంటే.. స్పెషల్ బస్సుల పేరుతో రూ.150 వరకు వసూలు చేస్తున్నారు. రూ.200 టికెట్ ధర ఉంటే.. రూ.300, రూ.320, రూ.350 వరకూ బస్సును బట్టి తీసుకుంటున్నారు. అయితే, పెరిగిన ధరలను చూపిస్తూ ప్రయాణికులు ఆర్టీసీ దోపిడీని సోషల్ మీడియా వేదికగా ఎండగడుతున్నారు.
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/telangana/telangana-rtc-faces-backlash-for-charging-50-extra-on-special-buses-during-dasara-2539089
framing not published · 4 outlets covered this story, below the floor for a split